గౌహతి: సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. తీస్తా నదికి చెందిన స్టేజ్ 5 డ్యామ్(Teesta Dam Power Station) ధ్వంసమైంది. ఇవాళ ఆ పవర్ స్టేషన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన ఆ ప్లాంట్.. కొండచరియల్లో పూర్తిగా దెబ్బతిన్నది. 510 మెగావాట్ల పవర్ స్టేషన్ సమీపంలో ఉన్న మట్టి చరియలు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. గత కొన్ని వారాల నుంచి అక్కడ అడపాదడపా స్వల్ప స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే మంగళవారం ఉదయం .. ఆ కొండకు చెందిన భారీ చరియలు కిందకు జారిపడ్డాయి. పవర్ స్టేషన్ మొత్తం ఆ శిథిలాల్లో చిక్కుకున్నది.
🚨 Breaking: A major landslide struck the NHPC Teesta Stage V HEP in Sikkim today, causing significant damage to the power evacuation building. The 510 MW project, which has its dam in Dikchu, was already impacted by last year’s GLOF. #Sikkim #NHPC #Hydropower #RenewableEnergy pic.twitter.com/zEugalHomT
— Abhinay Bhandari (@AbhinayBhandari) August 20, 2024
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే తరుచుగా కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో.. కొన్ని రోజుల క్రితం ఆ స్టేషన్ నుంచి జనాలను తరలించేశారు. పవర్‌స్టేషన్ వద్ద పనిచేస్తున్న కొందరు .. కొండచరియలు విరిగిపడే సమయంలో వీడియో తీశారు.
ప్రస్తుతం స్టేజ్ 5 డ్యామ్ ఫంక్షన్లో లేదు. గత ఏడాది అక్టోబర్‌లో లోనాక్ గ్లేసియల్ లేక్ వద్ద క్లౌడ్‌బస్ట్ కావడంతో.. ఆకస్మికవ వరదలు వచ్చాయి. ఆ నాటి నుంచి డ్యామ్ పనిచేయడం లేదు. ఆకస్మిక వరదల వ్లల చుంగ్తాంగ్ వద్ద తీస్తా డ్యామ్‌కు చెందిన కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. సిక్కింలో ఉన్న అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు ఇదే.