హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్ తిరుపతిని శాసనసభ సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం శాసనసభ సెక్రటరీ వీ నరసింహాచార్యులును శాసనమండలి సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం వారి నియామక ఉత్తర్వులు జారీచేశారు.