న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో క్రీడాకారులు సైతం ఎన్నికల బరిలో దిగి తమ సత్తాను ప్రదర్శించుకున్నారు. బెంగాల్లో టీఎంసీ తరఫున పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కాంగ్రెస్ దిగ్గజ నేత అధీర్ రంజన్‌ను ఓటమి బాట పట్టించారు. గుజరాత్‌కు చెందిన పఠాన్ బరంపురంలో లోక్‌సభ విపక్ష నేత, ఐదుసార్లు ఎంపీ అయిన అధీర్‌కు గట్టి షాక్ ఇచ్చారు.
అలాగే 193 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన మరో మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ టీఎంసీ తరఫున బర్దమాన్-దుర్గాపూర్‌లో ప్రముఖ బీజేపీ నేత దిలీప్ ఘోష్‌ను ఓడించారు. అలాగే పారాలింపిక్లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతక విజేత అయిన దేవేంద్ర జజారియా రాజస్థాన్ చురులో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడారు. హాకీ దిగ్గజ ఆటగాడు, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కే బీజూ జనతాదళ్ నుంచి ఒడిశాలోని సుందర్గర్లో పోటీ చేసి కేంద్ర మంత్రి జూయల్ ఓరమ్ చేతిలో పరాజయం పొందారు.