కేరళలో ప్రతీ ఏటా జరిగే త్రిసూర్ పూరంఫెస్టివల్ ఈ ఏడు కూడా భక్తులు లేకుండానే జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు. తిరువంబాడీ, పరమక్కువ ఆలయాల్లో జరిగిన ఈవేడుకులకు సిబ్బందిని కూడా తగ్గించారు. అలాగే ఆ శివుని ఊరేగింపులో పాల్గొనే ఏనుగుల సంఖ్యని కూడా కుదించారు.
1790-1805 కాలంలో కొచ్చిని పాలించిన రామవర్మ కుంజిప్పిల్లా తంపురాన్ మహరాజు ఈ వేడుకలను ప్రారంభించారు. అప్పటినుంచి తరతరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. కేరళలోని పెద్ద పండగల్లో త్రిసూర్ పూరం ఫెస్టివల్ కూడా ఒకటి. ఆ జిల్లాతో పాటు పరసరప్రాంతాల వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. శివుడి సేవలో తరిస్తారు.
#WATCH | Kerala: Thrissur Pooram festival being celebrated at Thiruvambadi and Paramekkavu Temples today. This year, the festival is being celebrated without the participation of common people in the wake of #COVID19 pandemic, the number of participants and elephants reduced. pic.twitter.com/ucnN1cvpyy
— ANI (@ANI) April 23, 2021