Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రచారకర్తగా పూనమ్ పాండే..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer ) పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్త (brand ambassador)గా పూనమ్ పేరును కేంద్రం పరిశీలిస్తోందనంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Poonam Pandey | సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer )తో తనను తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించుకొని ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్త (brand ambassador)గా పూనమ్ పేరును కేంద్రం పరిశీలిస్తోందనంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తలను ఖండించింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహనకు పూనమ్ పాండే పేరు పరిశీలనలో లేదని వెల్లడించింది. నటిని బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union health ministry) బుధవారం స్పష్టం చేసింది.
కాగా, గత శుక్రవారం గర్భాశయ క్యాన్సర్ (cervical cancer )తో పూనమ్ పాండే చనిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. స్వయంగా నటి టీమే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో పూనమ్ చనిపోయిందని అంతా భావించారు. ఈ మేరకు ఆమె మృతికి సంతాపంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే అనూహ్యంగా కొందరు నెటిజన్లు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పూనమ్ తన మరణంతో కొత్త పబ్లిసిటీ స్టంట్ (publicity stunt) చేస్తోందంటూ సోషల్ మీడియా మొత్తం చెప్పుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ పూనమ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని వివరణ ఇచ్చింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం చనిపోయానని చెప్పడం తీవ్ర విషయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
Parliament | పార్లమెంట్ వేదికగా వైట్ పేపర్ Vs బ్లాక్ పేపర్.. అసలేంటీ వార్..?
Nikki Haley | అమెరికాను భారత్ బలహీనంగా చూస్తోంది.. నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు
Pakistan | పాక్‌లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్.. మొబైల్ సేవలపై ఆంక్షలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

