Nikki Haley | అమెరికాను భారత్ బలహీనంగా చూస్తోంది.. నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ (Nikki Haley).. భారత్ (India)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు.
Nikki Haley | రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీ (Nikki Haley).. భారత్ (India)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. అయితే ప్రస్తుతానికి అమెరికా నాయకత్వంపై భారత్‌కు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ చాలా తెలివిగా ఆలోచిస్తోందన్నారు. అందుకే రష్యాతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తోందన్నారు. అదే సమయంలో అమెరికాను బలహీనంగా చూస్తోందని వ్యాఖ్యానించారు (United States as weak).
బుధవారం ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘అగ్రరాజ్యం తరఫున భారత వ్యవహారాలను చూశాను. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. భారతదేశం మాతో (అమెరికా) భాగస్వామిగా ఉండాలని కోరుకుంటోంది. మేము రష్యాతో భాగస్వామిగా ఉండాలనుకోవట్లేదు. సమస్య ఏంటంటే.. భారత్‌కు మనం గెలుస్తామన్న నమ్మకం లేదు. మనం చాలా బలహీనంగా ఉన్నామనుకుంటోంది. భారత్ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది. అందుకే వారికి భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది’ అని నిక్కీ హేలీ అన్నారు.
అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని నిక్కీ హేలీ తెలిపారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ కలిసి వస్తాయని పేర్కొన్నారు.
Also Read..
Hookah | కర్ణాటకలో హుక్కా తాగడంపై నిషేధం.. తక్షణమే అమల్లోకి
Pakistan | పాక్‌లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్.. మొబైల్ సేవలపై ఆంక్షలు
Hyderabad | పెండ్లి పేరుతో మోసం చేసిన మహిళా నిర్మాత.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితుడు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

