Prashant Kishore : జన్ సురాజ్ మిషన్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని స్ధాపించడం లేదని, కోటి మంది బిహార్ ప్రజలు తమ పిల్లల భవితవ్యం కోసం, 30 ఏండ్ల లాలూ, నితీష్, బీజేపీల పాలనకు పాతరేసేందుకు నూతన పార్టీతో ముందుకొస్తారని స్పష్టం చేశారు.
ఈ పార్టీల నుంచి బిహారీలకు విముక్తి ప్రసాదించడమే జన్ సురాజ్ లక్ష్యమని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పాత్ర గతంలో మాదిరే ఉంటుందని చెప్పారు. కోటి మంది బిహారీలు పార్టీ ఏర్పాటు చేసేందుకు ఏకమవడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ‘జన్ సురాజ్ అభియాన్’ (Jan Suraaj Abhiyan) రాజకీయ పార్టీగా మారేందుకు ముహుర్తం ఖరారైంది.
అక్టోబర్ 2న జన్ సురాజ్ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదక సాగుతున్నాయి. పార్టీ ఏర్పాటు దిశగా ఎనిమిది రాష్ట్ర స్థాయి సమావేశాలను జన్ సురాజ్ నిర్వహించనుంది. ఈ సమావేశాల తేదీల వివరాలు కూడా త్వరలో ఖరారు కానున్నాయి. బీహార్ వ్యాప్తంగా 1.5 లక్షల మందిని సమీకరించాలని ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని జన్ సురాజ్ నిర్ణయించింది.
Read More :
Trisha | ఏంటీ మళ్లీనా..? అజిత్‌కుమార్-త్రిష డబుల్ హ్యాట్రిక్ మూవీ..!