కర్ణాటకలో ‘అమూల్’ చిచ్చు
ఎన్నికల వేళ కర్ణాటకలో అమూల్ చిచ్చు రేగింది. తమ వ్యాపారాన్ని కర్ణాటకకు విస్తరించనున్నామని, త్వరలో బెంగళూరులో పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ ఇటీవల పేర్కొన్నది.
- రాష్ట్ర మార్కెట్లో ప్రవేశాన్ని ప్రకటించిన గుజరాత్ డెయిరీ
- ‘నందిని’ నాశనానికి బీజేపీ కుట్ర
- అమూల్‌లో విలీనానికి పావులు
- బీజేపీ సర్కార్‌పై ప్రతిపక్షాల ధ్వజం
బెంగళూరు, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల వేళ కర్ణాటకలో అమూల్ చిచ్చు రేగింది. తమ వ్యాపారాన్ని కర్ణాటకకు విస్తరించనున్నామని, త్వరలో బెంగళూరులో పాల ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభిస్తామని గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థ ఇటీవల పేర్కొన్నది. ఇప్పుడు ఈ వ్యవహారంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (కేఎంఎఫ్)ను గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకు రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ సహకరిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. కేఎంఎఫ్ బ్రాండ్ ‘నందిని’ని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని అమూల్‌కు హస్తగతం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపిస్తున్నాయి.
అమిత్‌షా బహిరంగ ప్రకటన
నందినిని అమూల్‌కు అమ్మేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నదని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ విషయాన్ని అమిత్‌షా బహిరంగంగా చెప్పారని, దీనికి రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లజే కూడా మద్దతు పలికారని పేర్కొన్నారు. నందినిని కాపాడుకోవాలంటే, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ‘అమూల్‌ను అడ్డుకోండి’ అంటూ ఆన్లైన్ ఉద్యమం సాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

