కలియాగంజ్: పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కలియాగంజ్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానిక ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన ఓ బాలిక(17) మృతదేహం ఈనెల 21న కాలువలో లభించింది. ఆమెపై లైంగికదాడి చేసి చంపినట్టు స్థానికులు ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు. పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ జైలు ముట్టడి చేపట్టారు. రోడ్లపై టైర్లను కాల్చి నిరసన వ్యక్తం చేశారు.