న్యూఢిల్లీ: ఢిల్లీలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ కారులో 47 లక్షలు గుర్తించారు. ఆ డబ్బును సీజ్(Cash Seized) చేశారు. సంగం విహార్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. రొటీన్ చెకింగ్ జరుగుతున్న సమయంలో ఆ క్యాష్‌ను పట్టుకున్నారు. 24 ఏళ్ల వసీం మాలిక్ అనే వ్యక్తి ఆ సమయంలో కారు డ్రైవ్ చేస్తున్నాడు. చెత్త సామన్లు అమ్మే వ్యక్తి అతను. స్టాటిక్ సర్వియలెన్స్ టీమ్ అతన్ని పట్టుకున్నది. తన వద్ద ఉన్న నగదుకు చెందిన రశీదులను మాలిక్ చూపించలేకపోయాడు. దీంతో అధికారుల ఆ డబ్బును సీజ్ చేశారు. ఎక్కడ నుంచి ఆ డబ్బు వచ్చిందన్న కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.