లక్నో: కబేళాలో పిల్లలు పని చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కలిసి తనిఖీలు చేశారు. 57 మంది బాలురు, బాలికలను రక్షించారు. (Children rescued) ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముస్సోరీ ప్రాంతంలో యాసిన్ ఖురేషీకి చెందిన అంతర్జాతీయ వ్యవసాయ, ఆహార కబేళాలో మైనర్లు పని చేస్తున్నట్లు మిషన్ ముక్తి సంస్థ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బుధవారం ఆ వధశాలపై పోలీసులు రైడ్ చేశారు. 31 మంది బాలికలు, 26 మంది బాలురతో సహా 57 మంది పిల్లలను రక్షించారు.
కాగా, పిల్లలతో జంతువులను వధించడం, మాంసాన్ని ప్యాక్ చేయించడం వంటి పనులను అక్కడ చేయిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. పని చేస్తున్న మరి కొందరి వయస్సును నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, బీహార్లోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను ఇక్కడ పనికి కుదిర్చిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పిల్లలతో పని చేయించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
आज उत्तरप्रदेश के ग़ाज़ियाबाद ज़िले के मसूरी इलाक़े में याशीन कुरेशी के इंटरनेशनल एग्रो फ़ूड के पशु क़त्लखाने पर @NCPCR_ के निर्देश पर @Uppolice के साथ की गयी संयुक्त छापामार कार्यवाही में 57 नाबालिगों (31 लड़कियाँ व 26 लड़कों इनमें दिव्यांग भी शामिल हैं।) को रेस्क्यू किया गया है… pic.twitter.com/0pmkT2dHgg
— प्रियंक कानूनगो Priyank Kanoongo (मोदी का परिवार) (@KanoongoPriyank) May 29, 2024