Bihar | కరెంటు అడిగారని.. సామాన్యులపై బుల్లెట్ల వర్షం.. బీహార్ ప్రభుత్వ నిర్వాకంతో ముగ్గురు మృతి
Bihar | ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగగా వారిపై ప్రభుత్వం కాల్పులకు తెగబడింది.
Bihar | కతీహార్: ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగగా వారిపై ప్రభుత్వం కాల్పులకు తెగబడింది. నిత్యం కోతలతో ఇబ్బందులుపడ్డ సామాన్యులు ఆందోళనలకు పిలుపునివ్వడమే వారి పాలిట శాపంగా మారింది. కరెంటు కావాలని అడిగిన పాపానికి వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన బుధవారం కతీహార్ జిల్లాలో చోటుచేసుకున్నది. నిత్యం సరిగా కరెంటు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ స్థానికులు బార్సోయ్ బ్లాక్ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో ఘటనాస్థలంలోనే ఒకరు మరణించగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం కతీహార్ జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఓ ఆందోళనకారుడు మాట్లాడుతూ ‘శాంతియుతంగానే నిరసన చేస్తున్నాం. కానీ పోలీసులు మాపై కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురికి బుల్లెట్ గాయాలు కాగా.. ముగ్గురు మరణించారు’ అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Firing
- Katihar
- National news
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

