బెంగళూరు: భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఒక మహిళ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అయితే ఆ అధికారి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. (Police Officer Molests Woman) టాయిలెట్ వద్దకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పావగడకు చెందిన మహిళ భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు మధుగిరి డివిజన్లోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అయితే డీఎస్పీ రామచంద్రప్ప ఆమెను లైంగికంగా వేధించాడు. ఆ ఫిర్యాదురాలిని టాయిలెట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
కాగా, రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ సొంత జిల్లాలో ఈ సంఘటన జరుగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను పోలీస్ అధికారి లైంగికంగా వేధించడంపై రాజకీయంగా దుమారం రేపింది. మరోవైపు ఈ వీడియో క్లిప్ లీకైన నాటి నుంచి ఆ పోలీస్ అధికారి కనిపించడం లేదు.
WATCH | A woman went to Madhugiri DYSP Ramachandrappa’s office in Pavagada, #Karnataka, to file a land dispute complaint.
Allegedly, the DYSP took her to his restroom & sexually assaulted her, claiming to help with the dispute. A video of the incident was recorded.
This issue… pic.twitter.com/tfEm3qRK15
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 3, 2025