ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్ దవాఖానలో తనపై నర్సింగ్ అధికారి సతీశ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా జూనియర్ రెసిడెంట్ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సతీశ్‌ను అరెస్టు చేయడానికి గురువారం పోలీసులు ఏకంగా దవాఖానలోని నాలుగో అంతస్తులో ఉన్న ఎమర్జెన్సీ వార్డుకు జీప్‌ను తీసుకెళ్లారు.