సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు ఆదివారం ఓ నక్సల్ డంప్ నుంచి టెలివిజన్ సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ రేంజ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ మాట్లాడుతూ, దంతేష్ పురం సమీపంలోని అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న డంప్‌లో బీపీఎల్ టీవీ సెట్ దొరికినట్లు చెప్పారు. టీవీ దొరకడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ డంప్ నుంచి మజిల్ లోడింగ్ గన్, టిఫిన్ బాక్స్ బాంబ్, ప్రెజర్ ఐఈడీ స్విచ్, 49 సిరంజ్‌లు, మొబైల్ చార్జర్లు, మావోయిస్టు బ్యానర్లు, సాహిత్యం, మందులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.