Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పాదయాత్రలో గందరగోళం నెలకొన్నది. శనివారం షేక్ సరాయ్ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తుండగా ఓ యువకుడు గుర్తు తెలియని ద్రవాన్ని ఆయన పైకి చల్లాడు. వెంటనే కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది, ఆప్ కార్యకర్తలు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్‌పై హత్యాయత్నం జరిగిందని ఆయన పక్కనే ఉన్న ఢిల్లీ మంత్రి భరద్వాజ్ ఆరోపించారు. దుండగుడు కేజ్రీవాల్‌పై స్పిరిట్ చల్లాడని, మరో వ్యక్తి అగ్గిపెతో వచ్చారని ఆయన పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్‌పై చల్లింది నీళ్లేనని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.