Watch: ఆటోను ధ్వంసం చేసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్ కావడంతో సస్పెండ్
Police Constable Vandalises E-Rickshaw | పోలీస్ కానిస్టేబుల్ ఆగ్రహంతో ఆటోను ధ్వంసం చేశాడు. చేతిలోని లాఠీతో ఆటో అద్దం, లైట్లు పగులగొట్టాడు. (Police Constable Vandalises E-Rickshaw) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
లక్నో: పోలీస్ కానిస్టేబుల్ ఆగ్రహంతో ఆటోను ధ్వంసం చేశాడు. చేతిలోని లాఠీతో ఆటో అద్దం, లైట్లు పగులగొట్టాడు. (Police Constable Vandalises E-Rickshaw) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 19న బతువాలోని శీతల ఆలయం వద్ద ఎలక్ట్రిక్ ఆటో మలుపుతిరుగుతుండగా పోలీసులు వెళ్తున్న బైక్‌ను స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ వెనుక కూర్చొన్న పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ రామ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. చేతిలో ఉన్న లాఠీతో ఎలక్ట్రిక్ ఆటో అద్దాలు, లైట్లు పగులగొట్టి ధ్వంసం చేశాడు.
కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ రాజేష్ రామ్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఆయనపై డిపార్ట్మెంట్ దర్యాప్తు కూడా జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
सन्दर्भित प्रकरण का पुलिस अधीक्षक मीरजापुर द्वारा संज्ञान लेते हुए सम्बन्धित आरक्षी को तत्काल प्रभाव से निलम्बित कर विभागीय जांच आसन्न की गई है।
— Mirzapur Police (@mirzapurpolice) January 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

