న్యూఢిల్లీ: రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ స్కూటర్‌పై పెట్రోలింగ్ చేశాడు. ఒక మలుపు వద్ద సిగ్నల్ ఇచ్చి మెల్లగా వెళ్లాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు కానిస్టేబుల్ నడుపుతున్న స్కూటర్‌ను ఢీకొట్టింది. కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ కానిస్టేబుల్ మరణించాడు. (Constable Dragged To Death) కారులో ఉన్న వారు అక్కడి నుంచి పారిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ సందీప్ నైట్ డ్యూటీలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో దోపిడీ కేసులు పెరుగడంతో సివిల్ డ్రెస్‌లో పెట్రోలింగ్ చేస్తున్నాడు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే రోడ్డు వైపు స్కూటర్‌పై కానిస్టేబుల్ సందీప్ వెళ్తున్నాడు. ఒక కారును నిర్లక్ష్యంగా నడపడాన్ని గమనించాడు. ఆ కారును ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే వేగంగా ఓవర్ టేక్ చేసిన ఆ కారు, కానిస్టేబుల్ స్కూటర్‌ను ఢీకొట్టింది. పది మీటర్ల దూరం వరకు ఆ కారు ఈడ్చుకెళ్లింది. అనంతరం కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సందీప్‌ను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ వదిలేసిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#दिल्ली के नांगलोई इलाके में रोड रेज की एक घटना में पुलिस कॉन्स्टेबल की मौत हो गई। घटना वीना एन्क्लेव के पास 28-29 सितंबर की देर रात करीब सवा दो बजे हुई, जब ऑन ड्यूटी कॉन्स्टेबल अपनी बाइक नांगलोई पुलिस स्टेशन से रेलवे रोड की ओर जा रहे थे। @DelhiPolice #DelhiPolice #delhi pic.twitter.com/rv5v2rLFNC
— DINESH SHARMA (@medineshsharma) September 29, 2024