చెన్నై, ఫిబ్రవరి 11: దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం, డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని మోదీని సూటిగా అడిగారు. చెన్నైలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికల ద్వారా దేశానికి నవోదయం వస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు.