హైదరాబాద్ : రాష్ర్టంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 27 నుంచి జులై 5వ తేదీ వరకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాల కోసం www.tsmodelschools.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు అని పేర్కొన్నారు.