Bihar | పాట్నా: రైల్లో టికెట్లు లేకుండా ప్రయాణించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారన్న బీహారీ మహిళల సమాధానం విని ఓ రైల్వే డివిజినల్ మేనేజర్(డీఆర్ఎం) అవాక్కయ్యారు. మహా కుంభమేళా సందర్భంగా యూపీలోని బక్సర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కుంభమేళాకు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదివారం డీఆర్ఎం జయంత్ కుమార్ బక్సర్ స్టేషన్ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పట్టాల దగ్గర ఉన్న మహిళలు టికెట్లు లేకుండా రైల్లో ప్రయాగ్ రాజ్ వెళ్లడానికి వచ్చారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ‘టికెట్లు లేకుండా ప్రయాణం చేయొచ్చని మీకు ఎవరు చెప్పారు’ అని ఆయన వారిని ప్రశ్నించారు. ‘నరేంద్ర మోదీ మాకు అలా చెప్పారు’ అని వారు జవాబిచ్చారు. దీంతో షాక్ తిన్న డీఆర్ఎం కొన్ని సెకండ్ల తర్వాత తేరుకుని.. అది తప్పుడు సమాచారమని వారికి తెలిపారు.