చెన్నై, ఫిబ్రవరి 28: కిడ్నీ సంబంధిత వ్యాధితో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నది. కుటుంబంతో కలిసి తమిళనాడులోని మధుర, రామేశ్వరం, కన్యాకుమారి ఆలయాల పర్యటనకు వచ్చిన సమయంలో అస్వస్థతకు గురికావడంతో దవాఖానలో చేర్చారు. ప్రహ్లాద్ మోదీ ప్రస్తుతం రేషన్ డీలర్ల ఫెడరేషన్‌కు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.