Ayodhya Live | అయోధ్య రామ మందిరంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పలు రికార్డులను నమోదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్ సైతం రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ఛానెల్‌గా ప్రధాని ఛానెల్ నిలిచింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఏకకాలంలో 90లక్షలమందికిపైగా ఒకేసారి ప్రత్యక్షంగా రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఏ యూట్యూబ్ ఛానెల్‌లోనైనా లైవ్ స్ట్రీమింగ్‌ను ఇంత పెద్ద సంఖ్యలో వీక్షించడం ఇదే రికార్డు.
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ‘PM Modi LIVE | అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారం.. శ్రీరాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ అండ్ రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ లైవ్’ టైటిల్ పేరుతో ప్రత్యక్ష ప్రసారమైంది. ప్రధాని ఛానెల్లో లైవ్వి ఇప్పటి వరకు కోటి వ్యూస్ వరకు వచ్చాయి. ఇంతకు ముందు చంద్రయాన్-3 ప్రయోగాన్ని సాఫ్ట్‌ల్యాండింగ్‌ను అత్యధికంగా లైవ్‌లో 80లక్షల మంది వీక్షించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్ల మార్క్‌ను దాటింది. నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్లో సబ్స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లుగా ఉండగా.. ఛానెల్లో మొత్తం 23,750 వీడియోలు అప్లోడ్ అయ్యాయి. ఇప్పటి వరకు 472 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లను పొందిన నాయకుడు మోదీయే.