న్యూఢిల్లీ: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు.. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) లేఖ రాశారు. ఇండియాను విజిట్ చేయాలని ఆయన ఆ లేఖలో ఆస్ట్రోనాట్ సునీతాను కోరారు. సుమారు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్.. ఇవాళ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి తిరుగు ప్రయాణమైంది. ఆస్ట్రోనాట్ సునీతాతో పాటు విల్మోర్.. మరో ఇద్దరు కూడా డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమికి వస్తున్నారు.
మార్చి ఒకటో తేదీన సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గత ఏడాది జూన్ నుంచి స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ బాగోగుల గురించి తన అమెరికా పర్యటనలో అడిగి తెలుసుకున్నట్లు ఆ లేఖలో ప్రధాని చెప్పారు. వేల మైళ్ల దూరంలో ఉన్నా.. నువ్వు మా గుండెలకు దగ్గరగా ఉన్నట్లు ఆ లేఖలో మోదీ తెలిపారు. నీ ఆరోగ్యం కోసం భారతీయులు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. నువ్వు చేపట్టిన మిషన్‌లో కూడా సక్సెస్ కావాలని భావిస్తున్నట్లు చెప్పారు.
సునీతా సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని, తమ లేఖ 140 కోట్ల భారతీయుల మనోగతాన్ని వ్యక్తం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రోనాట్ మైక్ మాసిమినో ద్వారా ఆ లేఖను పంపారు. సునీతాకు మద్దతు ప్రకటిస్తూ ఆమె పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సురక్షితంగా సునీతా తిరిగి రావాలని, దేశం ఆమెకు అండగా ఉంటుందన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్, బైడెన్‌లను కలిసినప్పుడు సునీత ఆరోగ్యం, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నట్లు లేఖలో మోదీ తెలిపారు.
As the world eagerly awaits the safe return of Sunita Williams, PM @narendramodi’s heartfelt message reflects the pride of 1.4 billion Indians.
In a letter delivered by astronaut Mike Massimino, the PM Modi conveyed his support and admiration, reaffirming India’s deep bond with… pic.twitter.com/7Uv0RaLDat
— MyGovIndia (@mygovindia) March 18, 2025