PM Modi : ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్రంలోని ఇసాగఢ్ తాలూకాలో ఉన్న ప్రసిద్ధ గురూజీ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. గురూజీ మహరాజ్‌కు హారతి ఇచ్చారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మోదీకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
పూజ సందర్భంగా ప్రధాని మోదీ భగవంతుడికి నారీకేళం, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజకు ముందు ఆలయ ప్రధాన అర్చకుడు మోదీ మెడలో సంప్రదాయ కండువా కప్పి లోపలికి ఆహ్వానించారు. ప్రధాని మోదీ గురూజీ మహరాజ్ ఆలయంలో పూజలు చేసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Prime Minister Narendra Modi visits and offers prayers at Guruji Maharaj Temple in Isagarh Tehsil, Madhya Pradesh.
(Video: DD) pic.twitter.com/yCLQAfXxLo
— ANI (@ANI) April 11, 2025