PM Modi | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ పోలింగ్ నేపథ్యంలో ఓటర్లుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైందని, ఈరోజు పోలింగ్ జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజా స్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరారు. ప్రత్యేకించి యువతీ యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
As the first phase of the Jammu and Kashmir Assembly elections begins, I urge all those in constituencies going to the polls today to vote in large numbers and strengthen the festival of democracy. I particularly call upon young and first-time voters to exercise their franchise.
— Narendra Modi (@narendramodi) September 18, 2024
కాగా, ఏడు జిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తొలి విడుతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరాజ్ రీజియన్లోని అనంత్ నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాలు, చీనాబ్ లోయలోని డోడా, కిశ్త్ వాద్, రాంబన్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్ పుర, కుల్గాం, దేవ్సర్, దూరు, కోకెర్నాగ్, అనంత్ నాగ్ వెస్ట్, అనంత్ నాగ్, శ్రీగుఫ్వారా – బిజ్బెహరా నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది.
Also Read..
Jammu Kashmir | పదేళ్ల తర్వాత జమ్మూ అసెంబ్లీకి ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకూ 11 శాతం పోలింగ్
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు