అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని( Capital ) పునఃప్రారంభం పేరిట రూ. 57,940 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) శుక్రవారం వెలగపూడిలో శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన రూ.8 వేల కోట్ల పైచిలుకు పనులను ప్రారంభించారు. పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్‌ను( Pylon ) ప్రధాని ఆవిష్కరించారు.
అమరావతి ( Amravati ) రాజధాని పనులన్నింటికీ ఏకకాలంలో బహిరంగ సభ వేదిక నుంచే 18 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మరో రూ.8 వేల కోట్ల విలువైన జాతీయ రహదారి, రైల్వే ప్రాజెక్టులకు, నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.
పీఎం రాక సందర్భంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి మంత్రులు, కూటమి ఎంపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెలగపూడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ , మంత్రులు ఘన స్వాగతం పలికారు.