న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భారత్ నుంచి బయలుదేరారు. నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయాన దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. బ్రెజిల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. తొలుత నైజీరియాకు వెళ్లి అక్కడి నుంచి బ్రెజిల్, గయానాల్లో పర్యటిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
పశ్చిమ ఆఫ్రికాలో సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశంలో తొలిసారిగా ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ నివసిస్తున్న భారతీయులను ఆయన కలుసుకుంటారు. 50 ఏండ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించటం గమనార్హం.