న్యూఢిల్లీ, జూన్ 5: జమ్ముకశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం శుక్రవారం ప్రధాని మోదీ చేతులమీదుగా జరగబోతున్నది. బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా కట్టిన ఈ వంతెన నిర్మాణం ఓ ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పటం అతిశయోక్తి కాదు. ఈ వంతెన విశేషాలు తెలుసుకుందాం..