గురువారం 04 జూన్ 2020
National - Apr 06, 2020 , 14:22:16

ఆసీస్ ప్ర‌ధానితో మాట్లాడిన మోదీ

ఆసీస్ ప్ర‌ధానితో మాట్లాడిన మోదీ

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్‌తో ప్ర‌ధాని మోదీ ఇవాళ ఫోన్లో మాట్లాడారు.  కోవిడ్‌19 నియంత్ర‌ణ కోసం రెండు దేశాలు తీసుకుంటున్న వ్యూహాత్మ‌క చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.  సంక్షోభ స‌మ‌యంలో  రెండు దేశాలు ద్వైపాక్షిక అనుభ‌వాల‌ను ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకోవ‌డం ముఖ్య‌మ‌న్నారు. ప్ర‌యాణ ఆంక్ష‌ల వ‌ల్ల భార‌త్‌లో నిలిచిపోయిన ఆస్ట్రేలియా దేశ‌స్థుల‌ను ఆదుకునేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఆస్ట్రేలియాలో ఉన్న భార‌తీయుల‌ను కూడా ర‌క్షించే బాధ్య‌త త‌మ‌కు ఉన్న‌ద‌ని స్కాట్ మారిస‌న్ తెలిపారు.


logo