PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జమ్ము కశ్మీర్ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం యువతతో యువ సాధికారత పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఆకాంక్షలను నెరవేర్చాలనుకునే సమాజం కేవలం సామర్ధ్యం గీటురాయిగా ముందుకెళుతుందని అన్నారు. తమ ప్రభుత్వ సామర్ధ్యం చూసిన దేశ ప్రజలు తమకు మూడోసారి అధికారం అప్పగించారని చెప్పారు. తమ ప్రభుత్వం శక్తిమేర పనిచేసి ఆ ఫలితాలను ప్రజలకు చేరవేస్తుందని తెలిపారు.
మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో సుస్ధిరతను ప్రపంచానికి చాటుతూ సందేశం పంపామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలువురు యువతీ, యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు అందచేశారు.
Read More :
Vande Bharat | వందే భారత్ ఆహారంలో బొద్దింక.. షాకైన జంట