మోదీజీ.. మీ ఫ్రెండ్ అబ్బాస్‌ను అడగండి
హైదరాబాద్: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఇటీవల 99వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆమె శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మోదీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు రాసుకొచ్చారు. తనకు చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికు పక్క ఊర్లో ఓ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే అతని మరణంతో ఆ ఫ్రెండ్ కుమారుడు అబ్బాస్‌ను తమ ఇంటికి తీసుకువచ్చాడని, తనతో పాటే ఉంటూ ఆ పిల్లవాడు స్టడీస్ పూర్తి చేశాడని, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని మోదీ గుర్తు చేశారు. అయితే ఆ అంశాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు. ఒకవేళ మీ మిత్రుడు అబ్బాస్ ఉండి ఉంటే.. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవో కావో అడిగి తెలుసుకోవాలన్నారు.
మోదీ తన ఫ్రెండ్ అబ్బాస్‌ను ఎనిమిదేళ్ల తర్వాత గుర్తు చేసుకున్నాడని, అసలు మోదీకి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియదని, ఒకవేళ అతను ఉండి ఉంటే.. ఇస్లామిక్ మతపెద్దలతో పాటు తాను కూడా మాట్లాడే ప్రసంగాలను విని వాటిపై వివరణ ఇచ్చేలా మోదీ చర్యలు తీసుకోవాలని అసద్ కోరారు. తామేమైనా అబద్దాలు చెబుతున్నామా మీ ఫ్రెండ్ అబ్బాస్ ద్వారా తెలుసుకోవాలన్నారు. అబ్బాస్ అడ్రస్ ఇస్తే తామే అతని వద్దకు వెళ్తామని అసద్ అన్నారు. ప్రవక్తపై నుపుర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమా కాదా అన్న విషయాన్ని అతన్ని అడిగి తెలుసుకుంటామన్నారు. నుపుర్ అనుచితంగా మాట్లాడినట్లు అతను అంగీకరిస్తాడని అసద్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

