ఒకే వేదికపై మోదీ, పవార్
విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం వేదిక పంచుకున్నారు. పుణెలో ప్రధాని మోదీకి లోక్మాన్య తిలక్ పురస్కారం అందించిన సభలో శరద్ పవార్ మాట్లాడారు.
పుణె, ఆగస్టు 1: విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం వేదిక పంచుకున్నారు. పుణెలో ప్రధాని మోదీకి లోక్మాన్య తిలక్ పురస్కారం అందించిన సభలో శరద్ పవార్ మాట్లాడారు. శివాజీ ఎప్పుడూ ఇతరుల రాజ్యాన్ని కాజేయలేదంటూ.. పరోక్షంగా శివసేన, ఎన్సీపీలో బీజేపీ చీలికలు తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మోదీతో పవార్ వేదిక పంచుకోవడం విపక్ష కూటమికి మంచి సంకేతం కాదని ఆ కూటమి సభ్యులు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని శివసేన (యూబీటీ) కూడా సామ్నా పత్రికలో విమర్శించింది. ఎన్సీపీని అవినీతి పార్టీగా అభివర్ణించిన మోదీతోనే పవార్ వేదిక పంచుకోవడం తగదని తెలిపింది. అదే వేదికపై తనపై వచ్చిన సందేహాలకు పవార్ సమాధానం ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. మోదీ పుణె పర్యటనకు వ్యతిరేకంగా ఎన్సీపీ కార్యకర్తలు ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

