PM Modi | ఉర్సుత సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రధాని నరేంద్ర మోదీకి కానుగా చాదర్‌ను పంపారు. ఈ నెల 13న అజ్మీర్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో ఈ చాదర్‌ను సమర్పించనున్నారు. ముస్లిం ప్రముఖులు గురువారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రధాని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముస్లిం ప్రతినిధుల బృందాన్ని కలిసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఉర్స్ సమయంలో అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి సమర్పించే చాదర్‌ను అందించినట్లు చెప్పారు.
దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. చిస్తీ సమాధిపై చాదర్ కప్పే సమయంలో ఆ సందేశాన్ని ముస్లిం మతపెద్దలు చదువుతున్నారు. ప్రధాని ఏటా ఉర్సు సందర్భంగా అజ్మీర్ దర్గాకు చాదర్‌ను కానుకగా పంపుతుంటారు. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఆయన చాదర్‌ను పంపారు. ఈ చాదర్‌ను ఈ నెల 13న దర్గాలో సమర్పించనున్నారు. ఉర్సు వేడుకలు ఈ నెల 13 నుంచి 21 వరకు కొనసాగనున్నాయి.