న్యూఢిల్లీ: కేరళలో విజిన్జమ్ సముద్ర పోర్టును ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి జలక్ ఇచ్చారు. ఇండియా కూటమిలో స్ట్రాంగ్ పిల్లర్ సీఎం విజయన్ అని, ఆయన ఇక్కడే ఉన్నారని, ఇక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు కూడా ఈ మీటింగ్‌లో ఉన్నారని, ఈ ఈవెంట్‌ను చూసిన కొందరికి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని మోదీ ఆరోపించారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మోదీ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతున్నది.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పలు మార్లు ప్రధాని మోదీని మెచ్చుకున్నారు. శశిథరూర్ వ్యవహార శైలిని.. ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఖండిస్తున్నారు. దీంతో ఆయన ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారారు. తిరువనంతపురం విమానాశ్రయానికి మోదీ వచ్చిన సమయంలో శశిథరూర్ అక్కడకు వెళ్లి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కరోనా సమయంలో మోదీ నిర్వహించిన వ్యాక్సిన్ డిప్లమసీని థరూర్ మెచ్చుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మోదీ చేసిన ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ ఎంపీ ప్రశంసించారు. పదేపదే మోదీని మెచ్చుకుంటున్న శశిథరూర్‌పై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది.
#WATCH | Thiruvananthapuram, Kerala: At the inauguration event of Vizhinjam port, PM Modi says, ” I want to tell CM, you are a strong pillar of INDI alliance, Shashi Tharoor is also sitting here. Today’s event is going to disturb the sleep of many” pic.twitter.com/UQvFrslWBP
— ANI (@ANI) May 2, 2025