కేదార్నాథ్: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ ఆయన కేదారీశ్వరుడికి పూజలు చేశారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 2013లో వరదల్లో దెబ్బతిన్న శంకరాచార్య సమాధిని పునరుద్దరిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా డిజైన్ చేసిన ఆది గురువు శంకరాచార్య విగ్రహం 12 అడుగులు ఉన్నది. బాబా కేదార్ ఆలయం వెనుక భాగంలో శంకరాచార్య సమాధి ఉన్న విషయం తెలిసిందే. ఆ సమాధి పునరుద్దరణ పనులను స్వయంగా మోదీ సమీక్షిస్తున్నారు. 2019 నుంచి శంకరాచార్య విగ్రహ పునర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆదిశంకరాచార్య విగ్రహం సుమారు 35 టన్నుల బరువుతో నిర్మించారు.
ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు కేదార్నాథ్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. కేదారీశ్వరుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు.
#WATCH Prime Minister Narendra Modi performs 'aarti' at Kedarnath temple in Uttarakhand pic.twitter.com/V6Xx7VzjY4
— ANI (@ANI) November 5, 2021