PM Modi : బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ (RJD), జేడీయూ (JDU), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రధాని (Prime Misnister) నరేంద్రమోదీ (Narendra Modi) బీహార్ రాజధాని పట్నాలో స్కిల్స్, ఎడ్యుకేషన్‌కు సంబంధించి రూ.62 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్జేడీపైన, కాంగ్రెస్ పార్టీపైన ప్రధాని విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ ఆటవిక పాలన కారణంగా బీహారీ యువత వలసలు వెళ్లాల్సి వస్తోందని ప్రధాని విమర్శించారు. ఆర్జేడీ హయాంలో విద్యావ్యవస్థ నిరాధరణకు గురైందన్నారు. పిల్లలకు సరైన విద్యావశాలు దొరకలేదని ఆరోపించారు. అభివృద్ది లేకపోవడంతో పేదరికంలో ఉన్న పేరెంట్స్ పిల్లలను బడులకు బదులుగా పనులకు పంపారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ బీహార్ కోసం చేసిందేమీ లేదని ప్రధాని విమర్శించారు. ఓ కాంగ్రెస్ నాయకుడు ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి అసత్యాలు ప్రచారం చేస్తుంటాడని రాహుల్‌గాంధీని ఉద్దేశించి అన్నారు. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు బీహార్‌ను ఎంతో అభివృద్ధి చేసిందని ప్రశంసించారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ నాయకుడి అబద్ధపు ప్రచారాలను బీహారీలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.