న్యూఢిల్లీ, అక్టోబర్ 22: రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్పష్టంచేశారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ 16వ సదస్సుకు హాజరైన మోదీ మంగళవారం పుతిన్‌తో భేటీ అయ్యారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సాయుధ ఘర్షణను తాము నిత్యం గమనిస్తున్నామని, గతంలో చెప్పినట్టు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నది భారత్ అభిమతమని చెప్పారు. ర ష్యా అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాలు ఆర్థిక సహకారం, వాతావరణ మార్పులు అం శాలపై విస్తృతంగా చర్చించనున్నాయి.