భావ్నగర్, సెప్టెంబర్ 20: అమెరికా టారిఫ్ల పెంపు, హెచ్-1బీ వీసా విధానంలో అనూహ్య మార్పుల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలపై ఆధారపడటం భారత్కు అతిపెద్ద శత్రువుగా మారుతున్నదని అన్నారు. భారతదేశ భవిష్యత్తును ఇతర దేశాలపై వదిలేసి భవిష్యత్తు తరాలను ఫణంగా పెట్టలేమని ప్రధాని అన్నారు. ‘విశ్వబంధు స్ఫూర్తితో భారత్ నేడు ముందుకు సాగుతున్నది.
ప్రపంచంలో మన దేశానికి పెద్దగా శత్రువులు లేరు. కానీ..ఇతర దేశాలపై ఆధారపడటమే..మనకు అతిపెద్ద శత్రువు పరిణమిస్తుంది. మనమంతా కలిసి దీనిని ఎదుర్కొని ఓడించాలి’ అని అన్నారు