లక్నో, మే 26: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదని తెలియటంతో.. ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో తడబడుతున్నారని సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని మోదీ ఆత్మ విశ్వాసం కోల్పోయారని అన్నారు. ఆదివారం సేలంపూర్ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
‘బీజేపీ ఓటమి ఖాయమన్న సంగతి ప్రధాని మోదీకి తెలుసు. అందుకే ప్రధాని మోదీ తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రసంగాల్లో ఆయన మాటలు తడబడుతున్నాయి. ప్రధాని పదవి చేజారిపోతుందన్న ఆందోళన ఆయనలో కనిపిస్తున్నది. 400కు మించి స్థానాలు సాధిస్తామన్న వారి నినాదం ఓడిపోవటం ఖాయం.’ అని అఖిలేశ్ అన్నారు.