న్యూఢిల్లీ: జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ యుద్ధ స్మారకంపై 26 వేల మంది అమర సైనికుల పేర్లను రాశారు. పుష్పగుచ్ఛాన్ని సమర్పించి, అక్కడ ఉన్న డిజిటల్ బుక్లో మోదీ సంతకం చేశారు. ఇటీవల అమర్ జవాన్ జ్యోతిని .. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతిలో విలీనం చేసిన విషయం తెలిసిందే.