PM Modi | జపాన్ పర్యటనలో ప్రధాని.. టోక్యోలో మోదీకి ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) జపాన్ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ టోక్యోలో ల్యాండ్ అయ్యానంటూ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) జపాన్ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ టోక్యోలో ల్యాండ్ అయ్యానంటూ ట్వీట్ చేశారు. ‘టోక్యోలో అడుగుపెట్టాను. అభివృద్ధిలో ఇరు దేశాలు పరస్పరం సహకారంతో ముందుకు నడుస్తున్నాయి. ప్రధాని ఇషిబాతో భేటీకి ఎదురుచూస్తున్నాను. తద్వారా ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింతగా పెంచుకోవడానికి, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి అవకాశం లభిస్తుంది’ అని పోస్టు చేశారు.
ఏఐ, సెమీకండక్టర్లు, పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోదీ 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్- జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం పలువురు ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. అనంతరం చైనాకు బయల్దేరుతారు. రెండు రోజులపాటు బీజింగ్‌లో పర్యటించనున్న మోదీ.. ఆగస్టు 31న ఆదేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న తియాన్జిన్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవుతారు. లద్దాఖ్ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై విరుచుకుపడుతోన్న వేళ మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B
— Narendra Modi (@narendramodi) August 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

