న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న సంక్రాంతి నాడు నూతన కార్యాలయ ప్రవేశం చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన సేవా తీర్థ్ సముదాయంలో ఈ కార్యాలయం ఉంది. ఈ సముదాయంలోని సేవా తీర్థ్ 1లో ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది.
అత్యాధునిక వర్క్‌స్పేసెస్, గ్రాండ్ సెర్మోనియల్ రూమ్స్ ఉంటాయి. దీనిని సేవ ఇతివృత్తాన్ని ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. స్వాతంత్య్రానంతరం 1947లో సౌత్ బ్లాక్‌లో పీఎంవోను ఏర్పాటు చేశారు.