న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మానసికంగా బలహీనమైనట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. మోదీ మానసికంగా కుప్పకూలిపోయారన్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన తెగ ఇబ్బందిపడుతారని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కుంటివాడయ్యారని, విద్యార్థుల గురించి ఆయన ఆందోళన చెందడం లేదని, మానసికంగా కూలిపోయారని, ఎన్నికల్లో మోదీ అనే కాన్సెప్ట్ నాశనమైనట్లు రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీకి ఎవరూ భయపడడం లేదని, గతంలో ఆయన ఛాతి 56 ఇంచులు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య చెప్పలేనని, మోదీ ఛాతి 32 ఇంచులకు చేరుకున్నదని, భయపెట్టి, బెదిరించి పనిచేయించుకోవడం ఆయనకు అలవాటు అని, ఇప్పుడు ఆ భయం పోయిందని, వారణాసిలో ఒకరు ఆయనపై చెప్పులు విసిరేశారని, ఎన్నికలకు ముందు మాత్రం ఆయన్నుతాకేందుకు జనం వణికేవారన్నారు.
నరేంద్ర మోదీ అన్న కాన్సెప్ట్‌ను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని, ఆయన పని అయిపోయిందరన్నారు. చాలా బలమైన ప్రతిపక్షం ఉందని, ఇది చాలా ఆసక్తికరమైన సమయమన్నారు. నోట్ల రద్దుతో ఎలా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారో, ఇప్పుడు విద్యా వ్యవస్థకు అదే జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
#WATCH | Congress leader Rahul Gandhi says, “…Now nobody in the country is afraid of him (PM Modi). Earlier the chest was 56 inches, but now I cannot give the number, but it has become 30-32…His way of working is to scare people, to intimidate them, now that fear is gone. I… pic.twitter.com/T6Hq8ueX4b
— ANI (@ANI) June 20, 2024