గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ‘వనతార’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అక్కడి పరిసరాలను సందర్శించారు. వనతారలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు.