PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అస్సాం రాజధాని గువాహటి (Guvahati) లోని లోకప్రియ గోపినాథ్ బర్దోలోయ్ అంతర్జాయ విమానాశ్రయం (LGBIA) లో కొత్త టెర్మినల్‌ను శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ టెర్మినల్‌ను ఏడాదికి 1.31 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగల సామర్థ్యంలో నిర్మించారు. ఈ టెర్మినల్ నిర్మాణానికి మొత్తం రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారు.
అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపినాథ్ బర్దోలోయ్ పేరు మీద గువాహటి విమానాశ్రయానికి ఆ పేరు పెట్టారు. విమానాశ్రయం వెలుపల గోపినాథ్ బర్దొలోయ్కు చెందిన 80 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని గతంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నూతన టెర్మినల్ నిర్మాణ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.5 వేల కోట్లు కాగా.. రూ.4 వేల కోట్లు ఖర్చయ్యింది.
మరో రూ.1000 కోట్లను మెయింటెనెన్స్, రిపేర్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవడం కోసం పక్కన పెట్టారు. ఆగ్నేయా ఆసియాకు గేట్ వే గా, ఈశాన్య భారతానికి కీలక ఏవియేషన్ హబ్‌గా ఉండాలనే లక్ష్యంతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the new terminal building of the Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati, Assam
(Source: DD) pic.twitter.com/c9KSGKJ1rT
— ANI (@ANI) December 20, 2025
Prime Minister Narendra Modi arrives at LGBI Airport, Guwahati; received by Assam Chief Minister Dr Himanta Biswa Sarma.
(Source: CMO) pic.twitter.com/TA2QD9mf0r
— ANI (@ANI) December 20, 2025