మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంత్‌రావు పవార్ ( Ajit Anantrao Pawar ) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని బారమతిలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ల్యాండింగ్ సమయంలో కుప్పకూలడంతో ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
విషయం తెలుసుకున్న మోదీ, అమిత్ షా మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ (Fadnavis)తో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది వారు పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్‌కు ప్రత్యేక స్థానం ఉందని, నిరుపేదల కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ పర్సనల్ సెక్యూరిటీ అధికారి విదీప్ జాదవ్, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ప్లైట్ అటెండెంట్ పింకీ మాలి చనిపోయారు.