న్యూఢిల్లీ: బీజేపీలో 75 ఏండ్ల వయస్సు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనే అనధికార నిబంధన కొనసాగుతున్నది. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం 75 ఏండ్లు రాబోతున్నాయి. ఒకవేళ ఈ నిబంధన పాటించి ప్రధాని పదవి నుంచి మోదీ తప్పుకుంటే ఎవరు ఆ బాధ్యతలు చేపడతారనే ఆసక్తి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో ‘ఇండియా టుడే’ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే జరిపింది. ఏ బీజేపీ నేతకూ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజా మద్దతు లేదని ఈ సర్వేలో తేలింది. అమిత్ షాకు 25 శాతం మంది, సీఎం యోగికి 19 శాతం మంది మద్దతు లభించింది. నితిన్ గడ్కరీ ప్రధాని కావాలని 13 శాతం మంది, రాజ్నాథ్ సింగ్కు మద్దతుగా 5 శాతం మంది, శివరాజ్ సింగ్ చౌహాన్ కావాలని 5 శాతం మంది చెప్పినట్టు ఈ సర్వే తెలిపింది.