న్యూఢిల్లీ : జీ20 (G20) సదస్సు రెండో రోజు ఆదివారం పలు దేశాధినేతలు, ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. సదస్సు చివరిరోజు జీ20 అధ్యక్ష అధికార దండాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అందచేశారు. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యుడిగా జీ20 స్వాగతించింది.
భారత్ ఆతిధ్యంలో ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెక్షన్ సెంటర్లో శనివారం నుంచి జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సదస్సు థీమ్‌గా ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్‌ను ప్రతిబింబించే వసుధైక కుటుంబ భావనను ఎంచుకున్నారు.
మరోవైపు జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆదివారం ఉదయం ఆయన వియత్నాం వెళ్లారు.
Read More :
Naya Mall | వావ్.. ! ఈ టీవీని బ్రీఫ్‌కేసులో పెట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్లొచ్చు!!