చండీఘర్ : దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో 89 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు నడుస్తుంది.
ఈ రైలు హైడ్రోజన్ ఇంధన సెల్స్‌ను వినియోగించుకుని పవర్‌ను సృష్టించుకుని నడుస్తుంది. ఈ రైలు ప్రారంభంతో ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు కలిగిన యూఎస్, చైనా, జపాన్, జర్మనీ దేశాల సరసన భారత్ చేరింది. 10 బోగీల హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైలు ఇది.